ఎండల వేళ ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి

ఎండల వేళ ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి
- ఎంపీడీవో
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలో బుధవారం జరుగుతున్న ఉపాధి హామీ సీసీటీ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.కూలీలు చేస్తున్న పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉదయం వేళల్లోనే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, చల్లని తాగునీటి సదుపాయం కల్పించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కనీసంగా రూ.300 కూలి అందుతున్నందుకు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో జీ.నర్సయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మధుసూదన్, పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
