యూరియ, డి.ఏ.పి ఎరువులు వాడకం మీద అవగాహన,…….

యూరియ, డి.ఏ.పి ఎరువులు వాడకం మీద అవగాహన,…….

వత్సవాయి, ఆంధ్రప్రభ : యూరియ,డి.ఏ.పి ఎరువులు వాడకం మీద మండల పరిధిలోని భీమవరం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో కెవికె అధిపతి డాక్టర్ ఎం రవి కిషోర్ పాల్గొని మాట్లాడుతూ సమతుల్య ఎరువులు వాడటం వలన భూమి సారవంతంగా అయ్యి, నాణ్యమైన దిగుబడులు చేకూరుతాయని వివరించారు. డాక్టర్ పి ఎన్ శివప్రసాద్ , సేద్య విభాగ శాస్త్రవేత్త, మాట్లాడుతూ జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడకం వలన నేలలో సేంద్రియ పదార్థం పెరిగి రసాయనిక ఎరువులను 15 నుంచి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు అని నేల ఆరోగ్యంతో పాటు నాణ్యమైన దిగుబడులను అర్జించవచ్చు అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల ఆధారిత రసాయనిక ఎరువులు వాడటం, మట్టి పరీక్షలు వాటి యొక్క ఆధారం ద్వారా రసాయనిక ఎరువులు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు అని తెలియజేశారు జగ్గయ్యపేట ఏడీఏ .సి.భవాని రైతుల కు ప్రీ మాన్సూన్ డ్రై సోయ్యింగి విత్తనాలను అందించి వాటిని వేయటం వలన కలిగే లాభలను రైతులకి తెలియజేసి నేలలో విచక్షణారహితంగా వాడే రసాయనాలను తగ్గించవలసిందిగా కోరారు. రైతు సోదరులు అందరికి ఆపాయిమ్స్ 2.0 యాప్ ద్వారా ఉన్న ఉపయోగాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ మేలైన యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలను ఖరీఫ్ కి తీసుకోవడంలో జాగ్రత్తలు గవహించాల్సిందిగా తెలియజేసి ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ కావలిసిన వారు రైతు సేవా కేంద్రం నందు సంప్రదించవలసిందిగా తెలియజేసారు . ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ కె సిబ్బంది అరవింద్, స్వప్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply