SIT notices | కీలక ఆధారాలతో విచారణకు వస్తా…

SIT notices | కీలక ఆధారాలతో విచారణకు వస్తా…

SIT notices | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ సిట్ నోటీసులపై స్పందించారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు పంపినప్పటికీ ఆయన రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాను ఎల్లుండి విచారణకు హాజరవుతానని భగీరథ్ స్పష్టం చేశారు.

విచారణకు హాజరు కాలేకపోయిన కారణాలను వివరిస్తూ భగీరథ్ సిట్ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఎల్లుండి విచారణకు తప్పకుండా హాజరవుతానని అందులో పేర్కొన్నట్లు తెలిసింది.

తన వద్ద ఉన్న కీలక ఆధారాలతో సిట్ ముందుకు వస్తానని భగీరథ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణలో సహకరిస్తానని కూడా పేర్కొన్నట్లు తెలిసింది.

Leave a Reply