15Vehicles | ఇంధన పొదుపుపై ప్రధాని ఆచరణలో సందేశం

15Vehicles | ఇంధన పొదుపుపై ప్రధాని ఆచరణలో సందేశం

15Vehicles | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇంధన కొరత, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చేయడంపై సందేశం ఇచ్చిన ప్రధాని.. అదే మార్గాన్ని స్వయంగా అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలతోనే ఆయన ప్రయాణించడం చర్చనీయాంశమైంది.

సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్650 గార్డ్‌, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లు కలిపి 12 నుంచి 15 వాహనాలు ఉంటాయి. అయితే ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50శాతం తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్లు ఎస్‌పీజీ అధికారులు వెల్లడించారు.

ప్రొటోకాల్ ప్రకారం భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని పిలుపుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను రెండు వాహనాలకు కుదించుకున్నట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ కూడా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించినట్లు వెల్లడించారు.

Leave a Reply