Dundigal | అనుమతుల్లేని షెడ్ల పై కొరఢా..

Dundigal | అనుమతుల్లేని షెడ్ల పై కొరఢా..
జేసీబీలతో కూల్చివేతలు
అక్రమ నిర్మాణాలపపై కటిన చర్యలు: మణికరన్, కమిషనర్, దుండిగల్
Dundigal |దుండిగల్, ఆంధ్ర ప్రభ : అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మించిన షెడ్లపై దుండిగల్ టౌన్ ప్లానింగ్ కొరఢా ఝలిపించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దుండిగల్ మున్సిపల్ సర్కిల్ లో నిర్మితమౌతున్న అక్రమ నిర్మాణాలపై ఆంధ్ర ప్రభ రెండు రోజులుగా వరుస కథనాలను ప్రచురిస్తుంది. ఈ మేరకు స్పందించిన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ లలిత్ ఆదేశాల మేరకు దుండిగల్ సర్కిల్ పరిధిలోని అనుమతిలేని షెడ్లను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మణికరన్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాల పై కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుదవారం 5 అక్రమ షెడ్ల ను గుర్తించి నేలమట్టం చేశామన్నారు.










