అచ్చంపేటలో 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు..

అచ్చంపేటలో 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు
తహశీల్దార్ సైదులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణ ప్రజలకు తహశీల్దార్ సైదులు కీలక సూచనలు చేశారు. బుధవారం నుండి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇండ్ల నుండి బయటకు రావద్దని పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి కూలీ పనులకు వెళ్లే కార్మికులు త్రాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు తగినంత నీరు వెంట తీసుకెళ్లాలని, ఎండల ప్రభావం తగ్గించుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తీసుకోవాలని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఎండ సమయంలో బయట సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తహశీల్దార్ సూచించారు.

Leave a Reply