పెరిగిన అభిషేక లడ్డు ధర..

పెరిగిన అభిషేక లడ్డు ధర..
100 నుండి 150 కి పెంపు
బాసర, ఆంధ్రప్రభ : చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో అభిషేకు లడ్డుదరాను ఆలయ అధికారులు వంద రూపాయల నుండి 150 రూపాయలకు పెంచారు. అభిషేక లడ్డూ ధర పెంపు పై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో భక్తులకు 100 గ్రాముల పులిహోర 20 రూపాయలు 100 గ్రాముల లడ్డు 25 రూపాయలకు విక్రయిస్తున్నారు.
పులిహోర వంద గ్రాముల లడ్డు దారులను మాత్రం పెంచ లేదు. లడ్డు ప్రసాదాల తయ్యారికి వాడే చక్కెర, ఇతరత్ర ముడి సరుకు ధరలు పెరగడంతో పెంచి నట్లు అధికారులు పేర్కొన్నారు.
