144 Force Tvk : ఇక బాహుబలి Andhra Prabha Top News

144 Force Tvk : ఇక బాహుబలి Andhra Prabha Top News

  • విశ్వాస పరీక్షలో
  • దళపతికి అదనపు బలం
  • పగ్గాలు సంపూర్ణం
  • సీఎం వజయ్​ శకం ఆరంభం

( ఆంధ్రప్రభ, చెన్నై ప్రతినిధి)

144 Force Tvk

టీవీకే దళనతి విజయ్​ తమిళ బాహుబలిగా అవరించారు. అసెంబ్లీలో మెజారీ సభ్యులు మద్దతు ప్రకటించారు. తమిళ రాష్ట రథసారథి పగ్గాలు ఆయన చేతికి అప్పగించారు. ఈ బల పరీక్షకు డీఎంకేగైర్హాజరు కాగా.. ఏఐడీఎంకే , బీజేపీ సహా 22 మంది వ్యతిరేకించారు. ఇక 144 మంది సభ్యుల మద్దతుతో దళపటి విజయ్​ కు ప్రభుత్వ పగ్గాలు అందించాని అసెంబ్లీ తీర్మానించింది. బుధవాకం ఉదయం 9.30 గంటలకు కొత్త స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ అసెంబ్లీలో బలపరీక్షను ప ర్యవేక్షించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, మెజారిటీ నిరూపించుకోవడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇటీవలి ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ఒంటరిగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచింది . సీఎం విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ (5), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ-ఎం (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు మద్దతు ప్రకటించడంతో కూటమి బలం 120కి చేరింది. ఇదే బలంతో అసెంబ్లీలో బలపరీక్షకు టీవీకే సిద్ధం కాగా.. అదనంగా మరో 24 మంది సభ్యులు మద్దతు పలకటంతో .. విజయ్​ కూటమి ప్రభుత్వం బలగం 144కు చేరింది. ప్రభుత్వానికి అనుకూలంగా (మద్దతు): 144 ఓట్లు వచ్చాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి (కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీకి చెందిన 25 మంది రెబెల్​ ఎమ్మెల్యేలు , ఒక AMMK ఎమ్మెల్యే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా: 22 ఓట్లు వచ్చాయి. ఎడప్పాడి పళనిస్వామి (EPS) నేతృత్వంలోని AIADMK అధికారిక వర్గం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.తటస్థంగా (Abstained): 5 గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. వీరిలో నలుగురు పీఎంకే (PMK) ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే (DMK) పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు (సభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో) ఓటింగ్‌ను బహిష్కరించి సభ నుండి బయటకు వెళ్ళిపోయారు.ఈ విజయంతో సీఎం విజయ్ తన ప్రభుత్వంపై అసెంబ్లీలో పూర్తి విశ్వాసాన్ని చాటుకుని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

144 Force Tvk : ఓఎస్‌డీగా జ్యోతిష్యుడా

144 Force Tvk

తమిళనాడు ప్రభుత్వంలో జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా నియమించడంపై ముఖ్యమంత్రి విజయ్‌ను వీసీకే, డీఎండీకే విమర్శించాయి. ఈ నియామకం జరిగిన ఒక రోజు తర్వాత మాట్లాడిన వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు, మూఢనమ్మకాలపై శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “ప్రభుత్వం జ్యోతిష్యంపై కాకుండా శాస్త్రీయ ఆలోచనపై దృష్టి పెట్టాలి,” అని ఆయన విశ్వాస ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా అన్నారు. ఒక డీఎండీకే ఎమ్మెల్యే కూడా ఈ చర్యను విమర్శిస్తూ, అధికార పదవులలో జ్యోతిష్యులను నియమించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ కూడా విమర్శిస్తూ, ప్రభుత్వం “యువతకు చెడు ఉదాహరణగా నిలవకూడదు” అని పేర్కొంది.

144 Force Tvk : ఏఎంఎంకే ఎమ్మెల్యే మద్దతు

144 Force Tvk

అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బహిష్కృత ఎమ్మెల్యే కామరాజ్, అసెంబ్లీలో టీవీకే అధినేత విజయ్​ కు తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లపాటు టీవీకే ప్రభుత్వానికి తన మద్దతును కొనసాగిస్తానని అన్నారు. “నేను నిన్న తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాను, ఈ రోజు కూడా ఇస్తున్నాను, రాబోయే ఐదేళ్లపాటు కూడా మద్దతు కొనసాగిస్తాను. సీఎం విజయ్ యావత్ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. ఆయన నన్ను కూడా వదిలిపెట్టరని నేను నమ్ముతున్నాను,” అని ఆయన అన్నారు.

144 Force Tvk : ఏఐఏడీఎంకేలో… మాటాకు మాట

144 Force Tvk

ఏఐఏడీఎంకే పార్టీ చీలిపోయింది. టీవీకే అధినేతకు మద్తతు ఇచ్చే విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఏఐఏడీఎంకే నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. టీవీకే ప్రభుత్వ బలపరీక్ష సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ, ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పార్టీ విప్‌కు కట్టుబడి ఉన్నామని, ముఖ్యమంత్రి విజయ్‌కు అనుకూలంగా ఓటు వేయవద్దని పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే “కలిసికట్టుగా పోరాడి” 47 సీట్లు గెలుచుకుందని, తమిళనాడులో “ఎంజీఆర్ మరియు అమ్మ తరహా పాలన”ను తిరిగి తీసుకురావడానికి పార్టీ కట్టుబడి ఉందని ఈపీఎస్ అన్నారు. పార్టీ మారేందుకు కొందరు ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేస్తున్నట్లు వదంతులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ బలపరీక్ష సమయంలో ఎలాంటి గుర్రపు బేరసారాల ప్రయత్నాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

144 Force Tvk : తిప్పికొట్టిన రెబెల్ ఎమ్మెల్యే

144 Force Tvk

తమిళనాడు అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా ఎడప్పాడి కె పళనిస్వామి చేసిన లంచం, గుర్రపు బేరసారాల ఆరోపణలను తిప్పికొడుతూ, ముఖ్యమంత్రి విజయ్‌కు ఎన్నికలలో స్పష్టమైన ప్రజా తీర్పు లభించిందని ఏఐఏడీఎంకే రెబెల్ ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణి అన్నారు. ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రభావితం చేస్తున్నారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు మరియు టీవీకే ప్రభుత్వానికి లభించిన మద్దతు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు.

144 Force Tvk : డీఎంకే గైర్హాజరు;

144 Force Tvk

తమిళనాడు అసెంబ్లీ లో సీఎం విజయ్​ బలపరీక్షకు డీఎంకే దూరమైంది. టీవీకేకు ప్రజా తీర్పు లేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, తమిళనాడు అసెంబ్లీ విశ్వాస ఓటుకు తమ పార్టీ దూరంగా ఉంటుందని డీఎంకే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ఫ్లోర్ టెస్ట్ డిబేట్ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలలో టీవీకే స్పష్టమైన ప్రజా తీర్పును పొందడంలో విఫలమైందని, అధికారంలో కొనసాగడానికి ఎన్నికల అనంతర పొత్తులపై ఆధారపడుతోందని ఉదయనిధి ఆరోపించారు. దాదాపు 65 శాతం ఓటర్లు విజయ్‌ను ముఖ్యమంత్రిగా తిరస్కరించారని, టీవీకే అధినేత “ప్రజలపై విశ్వాసం కోల్పోయారని” ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి “చెప్పిన మాటల్లో కనీస నిజాయితీ లేదని” పేర్కొంటూ, విజయ్ విశ్వసనీయతను కూడా డీఎంకే నాయకుడు ప్రశ్నించారు. విశ్వాస ఓటు ప్రక్రియలో గుర్రపు బేరసారాలు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. ఎన్డీఏ శిబిరంపై విమర్శలు చేస్తూ, బీజేపీ మిత్రపక్షం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ఇప్పుడు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని ఉదయనిధి ఎత్తి చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు ఓటు వేసినందుకు చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నారని ఆయన ఇంకా పేర్కొన్నారు.

ALSO RAD : Sparta 3 Mystery : అతి రహస్యం Andhra Prabha Top Story

Leave a Reply