అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు ..

అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు ..

కోల్‌కతాలో 8 మంది అరెస్ట్

విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న పెద్ద ముఠా గుట్టును విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో తలదాచుకుంటున్నారని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి దాదాపు రూ. 2 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా యువతను ఆకర్షించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. అక్రమ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply