social media | హిందూ సంఘాల అభ్యంతరాలు..

social media | హిందూ సంఘాల అభ్యంతరాలు..
social media |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రముఖ నటుడు అలీ ఓ సబ్బు ప్రకటన నేపథ్యంలో వివాదంలో చిక్కుకున్నారు. ‘ఘర్ సోఫ్’ అనే సబ్బు యాడ్‌లో లక్ష్మీ పూజ చేస్తున్నట్లు చూపించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో లక్ష్మీదేవి మంత్రాలు వినిపించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
సబ్బు ప్రకటనలో ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగించడం తగదని హిందూ సంఘాలు మండిపడ్డాయి. అలీని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశాయి. యాడ్‌ను వెంటనే నిలిపివేయాలని కూడా కోరినట్లు సమాచారం.
వివాదం ముదరడంతో నటుడు అలీ స్పందించారు. గతంలో తాను నటించిన ఓ సినిమాలోని సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని ఈ యాడ్ రూపొందించారని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ క్షమాపణలు చెప్పారు.

