Sonia Gandhi | ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

Sonia Gandhi | ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
Sonia Gandhi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.
స్వల్ప అస్వస్థతకు గురైన సోనియాగాంధీని గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇటీవల కాలంలో సోనియాగాంధీ పలుమార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో కూడా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరికొన్ని సందర్భాల్లో ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
