నాగర్‌కర్నూల్‌లో మే 14న మెగా జాబ్ డ్రైవ్

నాగర్‌కర్నూల్‌లో మే 14న మెగా జాబ్ డ్రైవ్
పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ, కలెక్టర్
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ:
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్మాణ్ సంస్థ , జిల్లా ఎంప్లాయ్‌మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ డ్రైవ్ పోస్టర్‌ను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ మెగా జాబ్ డ్రైవ్ 2026 మే 14వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నాగర్‌కర్నూల్ శ్రీపురం రోడ్డులోని ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడుతుంది. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా ఈ ఉద్యోగ అవకాశాలకు అర్హులు.
అభ్యర్థులు తప్పనిసరిగా రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు రెండు సెట్లుగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఆన్-స్పాట్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన నంబర్లు: 9542039139, 915495582.
