Associations | బండి సంజయ్ కుమారుడి కేసుపై పొన్నం ప్రభాకర్

Associations | బండి సంజయ్ కుమారుడి కేసుపై పొన్నం ప్రభాకర్
Associations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేసినట్లు పోన్నం ప్రభాకర్ తెలిపారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణను ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాత్రమే తాను చెప్పినట్లు స్పష్టం చేశారు. మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీపై కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నాయని, బాధితురాలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని పేర్కొన్నారు.
“మీరు ఏం చేస్తారో పెల్లా” అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ, తన అసలు ఉద్దేశ్యం బాధితురాలికి న్యాయం జరగాలనే దేనని తెలిపారు. ఆ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, ఆమెకు సంపూర్ణ మద్దతు అందిస్తామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
