under30yrs age | ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ మే 26

under30yrs age | ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ మే 26

under30yrs age | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), హైదరాబాద్ 2026 సంవత్సరానికి గాను టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 ఖాళీలు (టెక్నీషియన్ 23, టెక్నికల్ ఆఫీసర్ 4, డ్రైవర్ 1) ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివ‌రి తేదీ మే 26, 2026తో ముగుస్తాయి. CSIR-CCMB, హైదరాబాద్ నందు
మొత్తం పోస్టులు : 28 (టెక్నీషియన్-23, టెక్నికల్ ఆఫీసర్-4, డ్రైవర్-1) హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ : 05 జూన్ 2026

పోస్టుల వారీగా అర్హత & వయస్సు (26-05-2026 నాటికి)..
టెక్నికల్ ఆఫీసర్: M.Sc / BE / B.Tech / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, వయస్సు: 30 ఏళ్ల లోపు ఉండాలి.
టెక్నీషియన్ (Gr. II): 10వ తరగతి (SSC) + ITI, వయస్సు: 28 ఏళ్ల లోపు ఉండాలి.
డ్రైవర్: 10వ తరగతి + వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, వయస్సు: 27 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం (Salary): టెక్నీషియన్/డ్రైవర్: సుమారు రూ.39,545 నెలకు
టెక్నికల్ ఆఫీసర్: సుమారు ₹90,100 నెలకు

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు CCMB అధికారిక వెబ్‌సైట్ (ccmb.res.in) లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.500, SC/ST/PwDలకు ఉచితం.

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల (Medical Examination) ద్వారా ఎంపిక జరుగుతుంది.