లారీల కోసం స్పెషల్ డ్రైవ్..

లారీల కోసం స్పెషల్ డ్రైవ్..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధిలో గల టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున సహకార సిబ్బంది లారీల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా సహకార అధికారి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో సొసైటీ సిబ్బంది పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి ధాన్యం కోసం తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించేందుకు తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. లారీల కొరత ఉండటం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన చెప్పారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అధికారి నగేష్, పలు గ్రామాల సొసైటీ సీఈఓ లు శ్రీనివాస్, మహేశ్వరి, రాజు, మోహన్ గౌడ్, రమేష్, రవి తదితరులు ఉన్నారు.
