బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం!

బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ.. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగంతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ‘జోష్’ నింపారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారాయి.

​బీజేపీ కేడర్‌లో ‘జోష్’ నింపిన అంశాలు..
వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరగా.. ప్రధాని తనదైన శైలిలో స్పందిస్తూ… చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే వరంగల్ ‘పీఎం మిత్ర పార్క్’, జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పడం నిరుద్యోగ యువతలో ఆశలు కల్పించింది. రాష్ట్ర బీజేపీ నేతలు మోదీకి అయోధ్య రాముడి విగ్రహాన్ని బహూకరించడం హిందూత్వ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించేలా సాగింది.

​మొత్తానికి మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కేడర్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. అభివృద్ధి పనులు ఒకవైపు, రాజకీయ విమర్శలు మరోవైపు చేస్తూ మోదీ తన మార్క్ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పార్టీకి గట్టి పునాది వేసే ప్రయత్నం చేశారు.