తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ నివాసానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాళ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వీరిద్దరూ సమావేశమై చర్చించినట్లు సమాచారం. ఇటీవల పరస్పర విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని సీఎం విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన స్టాలిన్.. అప్పులు పరిమితుల్లోనే ఉన్నాయని, కొవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూనే ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ నుంచి తగిన ఆర్థిక సహకారం లభించకపోయినా రాష్ట్రాన్ని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఇటీవల రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న విజయ్, స్టాలిన్ భేటీ కావడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కీలక అంశాలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.