చిట్యాల వద్ద గోవుల పట్టువేత
చిట్యాల వద్ద గోవుల పట్టువేత
చిట్యాల, ఆంధ్రప్రభ : విశ్వనీయ సమాచారంతో చిట్యాల పట్టణ కేంద్రంలో అక్రమ గోవుల రవాణాపై పటిష్ట భద్రత తో చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను చిట్యాల సీఐ నాగరాజు చిట్యాల ఎస్సై రవికుమార్, నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో సుమారు 60 గోవులను తరలిస్తున్న ఒక భారీ లారీని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా గోవులను తరలిస్తున్న నిందితులపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని,సి.ఐ. నాగరాజు హెచ్చరించారు.
