జాతీయ రహదారుల శాఖ కార్యదర్శితో మచిలీపట్నం ఎంపీ

జాతీయ రహదారుల శాఖ కార్యదర్శితో మచిలీపట్నం ఎంపీ

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులు, గుడివాడ కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, బందరు పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, బైపాస్ రోడ్లు, గుడివాడ పట్టణ కనెక్టివిటీ తదితర కీలక అభివృద్ధి అంశాలను ప్రస్తావించి, వాటి పురోగతిపై చర్చించారు.


మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Leave a Reply