చిలకలూరిపేటలో ఆర్టీసీ డ్రైవర్ల చర్చలు విఫలం!

చిలకలూరిపేటలో ఆర్టీసీ డ్రైవర్ల చర్చలు విఫలం!

రోడ్ ఎక్కని పేట డిపో బస్సులు..
మండుటెండల్లో ప్రయాణికుల నరకయాతన!
నడుస్తున్న బయట డిపో బస్సులు

చిల‌క‌లూరిపేట‌, ఆంధ్ర‌ప్ర‌భ : చిలకలూరిపేట ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై చౌడవరం దగ్గర కొంతమంది యువకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపుమేరకు నిందితులను వెంటనే పట్టుకొని కఠిన శిక్ష విధించాలని కోరుతూ డిపోలో సమ్మెను చేపట్టాయి.

ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సమ్మెకు దిగటంతో ప్రయాణికుల పరిస్థితి దారుణంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ చర్చలు విఫలం కావడంతో సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే బస్సులు తిరిగేలా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు

Leave a Reply