ఉపాధి కూలీలకు మజ్జిగ మినరల్ వాటర్ బాటిళ్లు సరఫరా
ఉపాధి కూలీలకు మజ్జిగ మినరల్ వాటర్ బాటిళ్లు సరఫరా
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం బిచ్యనాయక్ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ రవినాయక్ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ తండ, బిచ్యనాయక్ తండ, హరిచంద్రు తండలకు చెందిన సుమారు 300 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, మినరల్ వాటర్ సరఫరా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేసముద్రం మండల ఏ పీవో యాకాంబరం , గ్రామ పంచాయతీ సెక్రటరీ రాము, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, మేట్ నరేష్, సన్నీ దేవల్, సుమన్, గ్రామపంచాయతీ సిబ్బంది రవి,సోమ్లా,మారు తదితరులు పాల్గొన్నారు.
