నగరాల సామాజిక వర్గాన్ని బిసి “డి”నుండి” ఏ”కి మార్చాలి..
నగరాల సామాజిక వర్గాన్ని బిసి “డి”నుండి” ఏ”కి మార్చాలి..
నగరాల సామాజిక వర్గానికి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని
నగరాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలి
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ కి వినతి పత్రం అందజేసిన నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు
భవానిపురం, ఆంధ్రప్రభ : నగరాల సామాజిక వర్గాన్ని బిసి”డి”నుండి” ఏ”కి మార్చాలని అదేవిధంగా తమ సామాజిక వర్గానికి బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మని నగరాల డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, తెలుగు యువత, బిసి సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా కులగణాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దామాషా లెక్కల ప్రకారంగా తక్కువగా ఉన్న నగరాల కులం అతి చిన్న సామాజిక వర్గం అయినందున బీసీ-డీ లో ఉన్నందున మిగిలిన వెనుకబడిన సామాజిక వర్గాల పోటీతో విద్య, ఉద్యోగ రాజకీయ సమీకరణాల్లో తమ సామాజిక వర్గానికి చెందవలసిన రిజర్వేషన్ తీవ్రమైన పోటీ తత్వం ఎదుర్కొంటుందని, తద్వారా తాము మరింత వెనుకబడి పోతున్నామని పేర్కొన్నారు. కావున నగరాలు సామాజిక వర్గాన్ని బీసీ-(డీ) నుండి బీసీ-(ఏ) లోకి మర్చి, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు.

అదేవిధంగా ఏపీ రాష్ట్ర నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, డైరెక్టర్ పదవులను త్వరితగతిన భర్తీ చేయాలని, తద్వారా నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు దామాషా ప్రకారం బిసి సబ్ ప్లాన్ నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బెవర సాయి సుధాకర్, సుఖాశి కిరణ్ కుమార్, పిళ్ళా కన్నమ నాయుడు, పిళ్ళా సూరిబాబు, కరణం దివాకర్ బాబు,నల్లానా వెంకునాయుడు. తెలుగు యువత జిల్లా సెక్రటరీ పైలా సతీష్, బంకా సురేష్,బొల్లు ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.!!
