మొక్క జొన్న కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా ధరూర్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, తేమ శాతం, మద్దతు ధర అమలు వంటి అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు కోరారు .