Successful Heroine | బాలీవుడ్ ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్!

Successful Heroine | బాలీవుడ్ ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్!

Successful Heroine | ఆశించిన ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్
నెట్టింట వైరల్ అవుతున్న పూజా హాట్ పిక్స్
ఆఖరి అస్త్రంగా గ్లామర్ షో..!

Successful Heroine |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకప్పుడు పూజా హేగ్డే బిజీ హీరోయిన్, అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది. సరైన సక్సెస్ లేకపోవడంతో బ్లాక్ బస్టర్ మూవీ కోసం తపిస్తుంది. అయితే.. ఈ అమ్మడి టైమ్ ఏమాత్రం బాలేదు. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. రెండు క్రేజీ సినిమాలు అలాగే మిస్ అయ్యాయి. అయినప్పటికీ ఈ బ్యూటీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంతకీ.. పూజాకి వచ్చినట్టే వచ్చి మిస్ అయిన ఆ రెండు సినిమాలు ఏంటి..? ఇప్పుడు పూజా ప్లాన్ ఏంటి..?

Successful Heroine |ఆశించిన ఆఫర్స్ రాకపోవడంతో..

ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో కెరీర్ ఆరంభంలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆతర్వాత ఆశించిన ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ కూడా సరైన ఛాన్సులు రాలేదు. అలాంటి టైమ్ లో హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అక్కడ నుంచి పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. వరుసగా విజయాలు సాధించి క్రేజీ హీరోయిన్ అయ్యింది.

Successful Heroine

Successful Heroine |నెట్టింట వైరలైన పూజా పిక్స్..

అయితే.. టైమ్ ఎప్పుడూ ఓకేలా ఉండదు కదా.. వరుసగా సక్సెస్ వచ్చినట్టే.. రాధేశ్యామ్, ఆచార్య, రెట్రో.. ఇలా వరుసగా ఫ్లాపులు వచ్చాయి. ఇప్పుడు ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అయితే.. ఛాన్సులు కోసం హాట్ హాట్ ఫోటోలుతో పూజా హేగ్డే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో పూజా ఇచ్చిన ఫోజులు అభిమానులను ఆకట్టుకుంటుండగా, ఆమె గ్లామర్ షో పై ఇండస్ట్రీలోనూ చర్చ నడుస్తోంది.

Successful Heroine

Successful Heroine |ఆఖరి అస్త్రం..

ఆఫర్స్ కోసం ఆఖరి అస్త్రంగా గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు పూజా తన లుక్, గ్లామర్ ప్రెజెంటేషన్‌లో మరింత జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ, తరచూ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్‌కి భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ క్వీన్ మెటీరియల్, గ్లామర్ డోస్ పెంచేసింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి.. పూజా బాలీవుడ్ లో అయినా ఆఫర్స్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి.

Successful Heroine

CLICK HERE TO READ vijay | బాక్సాఫీస్ ని షేక్ చేయనున్న జన నాయగన్

CLICK HERE TO READ MORE

Leave a Reply