vijay | బాక్సాఫీస్ ని షేక్ చేయనున్న జన నాయగన్
vijay | బాక్సాఫీస్ ని షేక్ చేయనున్న జన నాయగన్
vijay |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయగన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. సెన్సార్ కష్టాలు వలన ఇంత వరుకు రిలీజ్ కాలేదు. అయితే.. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం అవ్వడంతో.. జన నాయగన్ మూవీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు.. త్వరలోనే రిలీజ్ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో జన నాయగన్ మూవీ వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ.. జన నాయగన్ వచ్చేది ఎప్పుడు…?
జన నాయగన్ మూవీని మే 27న రిలీజ్ చేయనున్నట్టుగా డేట్ లాక్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక సినిమాల్లో నటించను ఇదే ఆఖరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీకి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే జన నాయగన్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. తమిళ రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను విజయ్ దక్కించుకోబోతున్నాడు. సాధారణంగా వారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక సినిమాలు చేయలేదు.. వాళ్లు నటించిన కొత్త సినిమాలు విడుదల కాలేదు. కానీ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆఖరి చిత్రం జన నాయకుడు రిలీజ్ అవుతుండడం విశేషం.
