2000people | ప‌రేడ్ గ్రౌండ్‌లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

2000people | ప‌రేడ్ గ్రౌండ్‌లో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

2000people | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ‌(ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ జ‌ర‌గ‌నుంది. స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు పూర్తి చేశాయి. స‌భ సంద‌ర్భంగా పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో మూడంచెల భద్రత కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం 2:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్ర‌ధాని మోదీ చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ప్రధాని పాల్గొని ప్ర‌సంగిస్తున్నారు. 2,000 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేప‌ట్టారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మోదీ సంద‌ర్భంగా నగరంలోని ప్రధాన వీధులు బీజేపీ జెండాలు, హోర్డింగులతో కాషాయమయంగా మారాయి.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఆక్టోప‌స్‌, ప్రత్యేక బలగాలు నిరంతరం పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పర్యవేక్షిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్స్, సభకు వచ్చే రూట్లు, పార్కింగ్ ప్రాంతాలను వందలాది సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చారు. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ జరుగుతోంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ టీమ్స్‌తో యాంటీ సబోటేజ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ల్యాప్‌టాప్‌లు, డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, హెల్మెట్లు, లైటర్లు, మ్యాచ్ బాక్స్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు సభలోకి అనుమతి లేదు.

Leave a Reply