BJP | ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు
BJP | ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు
BJP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పేరును బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భట్టాచార్య ప్రతిపాదించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు సువేందు అధికారిని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక కొత్త ప్రభుత్వంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా మారింది.
