chandrababu | 24 గంటల్లో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌పై దృష్టి పెట్టాలని ఆదేశం

chandrababu | 24 గంటల్లో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌పై దృష్టి పెట్టాలని ఆదేశం
chandrababu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాలనలో టెక్నాలజీ వినియోగంతో పాటు మానవతా దృక్పథం కూడా అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరును మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, 24 గంటల్లోపు ఈ-ఫైల్స్‌ను డిస్పోజ్ చేయాలన్న లక్ష్యంతో మంత్రులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగంగా జరిగితే ప్రభుత్వ సేవలు ప్రజలకు త్వరగా చేరుతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో పాలనలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
