నేటి నుండి తునికాకు సేకరణ షురూ…
నేటి నుండి తునికాకు సేకరణ షురూ…
- అడవికి వెళ్లాలంటే గ్రామ సింహాలు ఉండాల్సిందే
గంగారం, ఆంధ్రప్రభ ; మండలంలో వేసవి సీజన్ ప్రధాన ఉపాధి మార్గమైన తునికాకు సేకరణ నేటి నుండి అధికారికంగా ఐదు కల్లాలలో ప్రారంభమైంది. అటవీ ప్రాంతంపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజననేతర్లు కూలీలకు ఈ సేకరణ రూపంలో చేతినిండా పని దొరకనుంది,50 ఆకుల కట్టకు రూ. 3.42, పందెంలో 2, మర్రిగూడెంలో 2, చింతగూడెంలో 1 చొప్పున మొత్తం 5 కల్లాలు ఏర్పాటు చేశారు.
అడవిలో అడవి పందుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు తీవ్ర భయాందోళనల మధ్య అడవిలోకి వెళ్లాల్సి వస్తోంది. పందుల దాడి నుండి రక్షణ కోసం కూలీలు గ్రామ సింహాలు’ గుంపులు గుంపులుగా అరుపులు చేసుకుంటూ .. వెళ్తున్నారు. ఈ సేకరణ ద్వారా వచ్చే ఆదాయం వ్యవసాయ పెట్టుబడులకు, ఇంటి ఖర్చులకు ఊరటనిస్తుందని కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
