gold rate| రెండు రోజులుగా పైపైకి..
gold rate| రెండు రోజులుగా పైపైకి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
24 క్యారెట్స్ తులం- రూ.1,52,460
(రూ.330 పెరిగింది)
22 క్యారెట్స్ తులం- రూ.1,39,750
(రూ.300 పెరిగింది)
కిలో వెండి ధర – రూ.2,75,000
(రూ.5వేలు పెరిగింది
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఉన్నట్టుండి రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. పైపైకి పోతున్న ధరలను చూసి కళ్లు తేలేస్తున్నారు. రెండురోజుల క్రితం వరకు నేల చూపులు చూసిన గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. నిన్న, ఇవాళ మళ్లీ పెరిగాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు, ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పెరుగుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర క్రితం రోజు 10 గ్రాములకు రూ.2950 మేర పెరగగా ఈరోజు మరో రూ.330 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,52,460 వద్దకు ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు నిన్నటి రోజున రూ.2700 పెరగగా ఈరోజు మరో రూ.300 పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,39,750 వద్దకు దూసుకెళ్లింది.
క్రితం రోజు కిలో వెండి రేటు రూ.5000 పెరగగా ఈరోజు మరో రూ.5 వేలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,75,000 స్థాయికి ఎగబాకింది.
