ట్రక్కు ఢీకొని గేదె మృతి..
ట్రక్కు ఢీకొని గేదె మృతి..
- డ్రైవర్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పరిధిలోని సత్తెనపల్లి గ్రామం వద్ద గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగ్లవత్ అనూష అనే రైతుకు చెందిన బర్రె మేతకు వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బర్రె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం, డ్రైవర్ అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే ట్రక్కును ఆపి డ్రైవర్‌ను నిలదీశారు. ప్రమాదంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ నష్ట పరిహారం చెల్లిస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించుకొని చర్చలు జరిపిస్తున్నారు.
