Rs.10 lakhs | ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు
Rs.10 lakhs | ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు
Rs.10 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భద్రాచలం అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. చెట్లు నరికిన ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఎఫ్డీఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డీఓ సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలోని బృందం ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ కేసులో చర్ల ఇంచార్జ్ డీఆర్ఓ కృష్ణయ్యను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
