రైతుల సంక్షేమానికి కృషి చేస్తా

రైతుల సంక్షేమానికి కృషి చేస్తా

  • పీఎసీఎస్ చైర్మన్ కుబీర్ రేకుల గంగా చరన్

కుబీర్, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పీఎసీఎస్ చైర్మన్ గంగా చరణ్ తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారం పీఎసీఎస్ పాలకవర్గాలను పునరుద్ధరించిన నేపథ్యంలో బుధవారం కుబీర్ మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో చైర్మన్ రేకుల గంగా చరణ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను డైరెక్టర్లు,కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. మండలంలోని కుబీర్ తో పాటు ఆయా గ్రామాలలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకు లక్షల క్వింటాళ్ల ధాన్యం కాంటా అయిందని, వేల క్వింటాళ్ల ధాన్యం తరలించినట్లు తెలిపారు. రైతులకు అకాల వర్షాల భయం ఉందని, రైతులు అధైర్య పడవద్దని, పీఎసీఎస్ చైర్మన్ రేకుల గంగా చరన్ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. రవాణా సమస్యను అధిగమిస్తామని, కాంటా అయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లుకు తరలించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ సర్పంచులు సహకరించాలని కోరారు.

త్రాగునీరు, ఇతర చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహకరించాలని తెలిపారు. రైతు పక్షపాతిగా వ్యవహరిస్తానని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ సీఈవో క్రాంతి కుమార్, డైరెక్టర్లు వసంత్, లాలీష్, గోపాల్, శంకర్ దొడ్డి, లింగన్న, ముధోల్ భూమన్న, పండిత్ , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.