పీఏసీఎస్‌లో మళ్లీ బాధ్యతలు స్వీకారం
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని పాండవ పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా రామడుగు శైలజ రమేష్ రావు తో పాటు పాలకవర్గం సభ్యులు బుధవారం తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. గత డిసెంబర్ నెల 19వ తేదీన సింగిల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయంపై పలువురు సింగిల్ విండో చైర్మన్ లు హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి పాత వర్గాలకు పదవి బాధ్యతలు అప్పగించాలని ఈనెల 4న హైకోర్టు తీర్పు నివ్వడంతో జిల్లా సహకార సంఘాల అధికారి ఆదేశాల మేరకు బుధవారం సింగిల్ విండో చైర్మన్ తో పాటు పాలకవర్గం సభ్యులు తిరిగి పదవి బాధ్యతలను స్వీకరించారు.
పాండవపూర్ సింగిల్ విండో చైర్మన్ గా రామడుగు శైలజ రమేష్ రావు సొసైటీ డైరెక్టర్లు పి రాజేశ్వర్ రెడ్డి గొల్ల వెంకటేష్ వేల్పుల నారాయణ కర్ణాటక రాజన్న చుంచు వెంకన్న సంతపురి సుగుణ కన్నె పద్మ నాంపల్లి భూమరాజం దాసరి సత్తయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు.
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన పిఎసిఎస్ చైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావు సొసైటీ డైరెక్టర్ల లకు సొసైటీ ఉద్యోగులు సిబ్బంది శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కడం ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ సాజిద్ సీఈఓ ఆశన్న లకు కూడా సొసైటీ చైర్మన్ రామడుగు శైలజ సొసైటీ డైరెక్టర్లు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కడం ఎడిసిసి బ్యాంక్ మేనేజర్ సాజిద్ సొసైటీ సీఈఓ బి. ఆశన్న పాలకవర్గం సభ్యులు సొసైటీ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
