ట్రాఫిక్ సమస్యలకు చెక్

ట్రాఫిక్ సమస్యలకు చెక్

  • శ్రీపురం చౌరస్తాలో నూతన సిగ్నల్స్ ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన అడుగు పడింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, ట్రాఫిక్ ఎస్‌ఐ కళ్యాణ్, టౌన్ ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆధునిక సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత మరియు సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక కూడళ్ల వద్ద కూడా ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, పోలీసులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభమైన ట్రాఫిక్ సిగ్నల్స్‌తో నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.