మొక్కజొన్న కేంద్రం ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

మొక్కజొన్న కేంద్రం ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

బిచ్కుంద, ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ, మార్క్ ఫైడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. మద్దతు ధర 2 వేల 400 క్వింటాలు ధర తో రైతుల దగ్గర కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు మద్దతు ధర లభిస్తుందనిఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా చేరేటట్లు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, బిచ్కుంద మండలం అధ్యక్షులు నాగనాథ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, పుల్కల్ సర్పంచ్ సంతోష్ పటేల్, వాజిద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, గుండె కల్లూరు సీనియర్ నాయకులు రాజు పటేల్, తదితరులు పాల్గొన్నారు.