రుద్రూర్‌లో రోడ్డు ప్రమాదం మహిళకు తీవ్ర గాయాలు
రుద్రూర్‌లో రోడ్డు ప్రమాదం మహిళకు తీవ్ర గాయాలు
రుద్రూర్, ఆంధ్రప్రభ: రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమైంది.
బాధిత మహిళ వివరాలను సేకరించగా, ఆమె కొత్తపల్లి గ్రామానికి చెందిన సంగోలా అంజవ్వగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు ఆంధ్రప్రభ రిపోర్టర్ అప్రమత్తమై 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన వాహనం ఫోటోలను ఆంధ్రప్రభ రిపోర్టర్ స్థానిక ఎస్సై సాయన్నకు పంపారు. దీనిపై ఎస్సై తక్షణమే స్పందించి, ఆ వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎస్సై బోధన్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి పరిస్థితిని సమీక్షించారు. అంజవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై సాయన్న తెలిపారు.

