naturalstar | ‘అండర్‌డాగ్ నుంచి విజేత’ అంటూ అభినందనలు

naturalstar | ‘అండర్‌డాగ్ నుంచి విజేత’ అంటూ అభినందనలు
naturalstar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ విజయం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, టాలీవుడ్ హీరో నాని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అండర్‌డాగ్‌గా ప్రారంభమైన ప్రయాణం చివరకు విజయంలో ముగిసిందని పేర్కొంటూ విజయ్‌కు అభినందనలు తెలిపారు.
తమిళనాట టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, విజయ్ సీఎం పదవి చేపట్టడం లాంచనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ విజయంపై స్పందించిన నాని, “ముందు సందేహించారు.. తర్వాత కిరీటం పెట్టారు. మన ఇంట్లో జరిగినదే ఇప్పుడు మన పొరుగు ఇంట్లో జరుగుతోంది” అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. అండర్‌డాగ్‌గా భావించిన వ్యక్తి గెలవడం ఎప్పుడూ సినిమా లాంటి అనుభూతినిస్తుందన్నారు. అంతేకాదు, తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, వారి కోసం మంచి జరగాలని ఆశిస్తున్నానని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
