victory | కింగ్ మేకర్ కాదు.. కింగ్ విజయ్..
victory | కింగ్ మేకర్ కాదు.. కింగ్ విజయ్..
victory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ సంచలన విజయంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎన్నికల ముందు “కింగ్ మేకర్” పాత్ర పోషిస్తాడని భావించిన రాజకీయ వర్గాలు, ఇప్పుడు ఆయనను నేరుగా “కింగ్”గా అభివర్ణిస్తున్నాయి. తాజా కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉండటంతో అధికారానికి చేరువైంది. ఈ నేపథ్యంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటాం” అంటూ స్పష్టం చేశారు.
దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన వ్యూహాలు స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే, ఏఐడీఎంకే మధ్యనే కొనసాగుతుండగా, ఈసారి విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. యువతలో విపరీతమైన ఆదరణ, మార్పు కోసం ఓటర్ల ఆసక్తి, కొత్త రాజకీయ శైలి ఇవన్నీ బాగా విజయ్ కి కలిసొచ్చాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే—విజయ్ కేవలం కింగ్ మేకర్‌గా మాత్రమే నిలుస్తాడని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆయన నేరుగా అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదగడం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు.
అయితే.. ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సి ఉండటంతో తుది పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద “కింగ్ మేకర్ కాదు.. కింగ్ విజయ్” అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
