యోగా గురువు పాపయ్య గౌడ్ కు సన్మానం

యోగా గురువు పాపయ్య గౌడ్ కు సన్మానం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణ పరిధిలోని క్రికెట్ బాక్స్ ప్రాంగణంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరం ఆదివారం తో విజయవంతంగా ముగిసింది. మార్నింగ్ వాక్ కమిటీ ఆధ్వర్యంలో, సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్ సహకారంతో ఈ శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరంలో యోగా నేర్పించిన గురువు పల్చం పాపయ్య గౌడ్ కు కమిటీ సభ్యులు చిరు సన్మానం చేసి, ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మార్నింగ్ వాక్ కమిటీ అధ్యక్షుడు జంగయ్య, మాజీ ఎంపీటీసీ కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశం లు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
