ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక..
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న తొమ్మిది రైతు వేదికలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నల్ల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలంలోని మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్స్, ఏఎంసి డైరెక్టర్స్, వివిధ శాఖల అధికారులు, గ్రామాలలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు, రైతులు, ప్రజా ప్రతినిధులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏవో నాగరాజు కోరారు.
