tgcm | ఎంపీ అర్వింద్ విమ‌ర్శ‌లు

tgcm | ఎంపీ అర్వింద్ విమ‌ర్శ‌లు

tgcm | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. పాల‌న‌పై అస‌లు రేవంత్‌కు అవ‌గాహ‌న లేదని విమ‌ర్శించారు. రిజ‌ర్వేష‌న్లను అడ్డుకొని మ‌హిళ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల‌లో జాప్యం జ‌రుగుతుంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోందని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో కేసీఆర్ ప‌ని ఖ‌త‌మైంద‌ని, ఇక ఆయన హ‌వా ముగిసింద‌న్నారు. నమ్మిన నాయకులను మోసం చేయటం కేసీఆర్‌కు అలవాటని, జీవన్‌ రెడ్డిని కూడా కేసీఆర్ మోసం చేస్తారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కొట్టుకుపోతాయ‌న్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.