driver | కారుతో ఢీకొట్టి.. 2.కి.మీ. ఈడ్చుకెళ్లి..
driver | కారుతో ఢీకొట్టి.. 2.కి.మీ. ఈడ్చుకెళ్లి..
driver | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. గాయత్రీనగర్ వద్ద బైక్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడిని కారుతో ఢీకొట్టాడు. కొడుకు తీవ్రంగా గాయపడటంతో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. కారును ఆపేందుకు తండ్రి బానెట్ ముందుకు వెళ్లాడు. కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. బానెట్‌పైకి బాధితుడి తండ్రి పడ్డా అలాగే సుమారు 2 కి.మీ. తీసుకెళ్లాడు. బాలాపూర్ చౌరస్తా వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలి కారు డ్రైవర్ పరారైయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
