Soft drink | నంద్యాల జిల్లాలో దారుణం.
Soft drink | నంద్యాల జిల్లాలో దారుణం.
Soft drink | నంద్యాల జిల్లా, ఆంధ్రప్రభ : కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ఆ పసి ప్రాణాల మీదకు తెచ్చాయి. ఏ పాపం తెలియని చిన్నారులకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి తాగించిన ఓ కసాయి తండ్రి ఉదంతం ఇప్పుడు నంద్యాల జిల్లాలో కలకలం రేపుతోంది. భార్యతో ఉన్న గొడవలను మనసులో పెట్టుకొని తన ఇద్దరు బిడ్డలను హతమార్చాలని చూశాడు. వివరాల్లోకి వెళితే… మెటా నాయక్ అనే వ్యక్తి తన భార్యతో తరచూ గొడవ పడేవాడు.
శనివారం భార్య ఇంట్లో లేని సమయం చూసి, కుమారుడు జయత్ నాయక్ (6), కుమార్తె మైథిలి భాయ్ (4)లకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి బలవంతంగా తాగించాడు. పిల్లలు అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వెంటనే వారిని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాలకు పిల్లలను బలి చేయాలని చూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

CLICK HERE TO READ MORE : Rs500perday | కఠిన నిబంధనలు.. స్వేచ్ఛకు దూరం
