వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు టెంట్, మంచినీరు ఏర్పాటు

వేసవి దృష్ట్యా ఉపాధి కూలీలకు టెంట్, మంచినీరు ఏర్పాటు

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ స్థానిక సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ శనివారం ఉపాధిహామీ కూలీలు పనులు చేసే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం కూలీల రిపోర్ట్ పెరుగుటకు గ్రామంలో ఉన్న కూలీలను పెంచాలని సూచించారు. సర్పంచ్ ఎండ తీవ్రత దృష్ట్యా కూలీల కోసం టెంట్, మంచి నీటి క్యాన్లు, శీతల పానీయాలు అందజేశారు.

ఉపాధి హామీ కూలీలకు ఇబ్బంది కలగకుండా కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను గ్రామ ఆశా వర్కర్లు అందరు, గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే పని ప్రదేశాల వద్ద కూలీలకు పంపిణీ చేయాలని, మండలం వైద్య శాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యూసుఫ్, ఫీల్డ్ అసిస్టెంట్ శారద, వార్డు సభ్యులు, కూలీలు పాల్గొన్నారు.