220kVcables | అమరావతి పనులకు..
220kVcables | అమరావతి పనులకు..
మరో రూ.2,540 కోట్లు..
సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ ఆమోదం
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల సవరణ
అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్లు కేటాయింపు
385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్‌కు ఓకే
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
20 అంశాలపై సుదీర్ఘంగా చర్చ
220kVcables | అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతిలో పలు అభివృద్ధి పనులను రూ.2,540 కోట్లతో చేపట్టాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
220kVcables | కేబినెట్ సుదీర్ఘ చర్చ..
వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరిగింది.. మొత్తం 20 అంశాల అజెండాతో జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం రూ.798 కోట్ల ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల కోసం రూ.580 కోట్ల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు రూ.1,180 కోట్లు కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్‌కు భూమిని కేటాయించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
220kVcables | మ్యుటేషన్ ఛార్జీలకు చట్టసవరణ..

మున్సిపాలిటీలకు చెందిన ఆస్తుల లీజ్ రెన్యువల్, అద్దె నిర్ణయ విధానాల సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలను ఒకే విధంగా అమలు చేసే చట్టసవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాల్లో చీఫ్ కోర్టు మేనేజర్, సీనియర్ కోర్టు మేనేజర్లు, కోర్టు మేనేజర్లతో కలిపి 21 కొత్త పోస్టులు సృష్టించేందుకు అంగీకారం తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్టును సెక్షన్ ఆఫీసర్గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈటీసీ శిక్షణ కేంద్రాల్లో 20 పోస్టులు సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చింది. అదనంగా మరో 9 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
CLICK HERE TO READ MORE : Everest | డాక్టర్ రూపిందర్ కౌర్ అజేయ సంకల్పం!
