ఆర్టీసీ సమ్మె విరమణపై హర్షం

ఆర్టీసీ సమ్మె విరమణపై హర్షం

సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో బుధవారం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాను అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేఖం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ నేతలు సమ్మె విరమణకు ముందుకు రావడం ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ నేతలకు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, దుబ్బాక కాశిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, వర్కల రాము, చింతల శివ, యువజన కాంగ్రెస్ నాయకులు పన్నాల మధుసూధన్ రెడ్డి, మొగుదాల వెంకటేష్, చింతకింది గణేష్, యాట సంతోష్, సురకంటి బాలకృష్ణరెడ్డి, సందగళ్ల కిరణ్, రాచకొండ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply