Since 2020 | వనస్థలిపురంలో మహిళ అరెస్ట్..

Since 2020 | వనస్థలిపురంలో మహిళ అరెస్ట్..

Since 2020 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి సుమారు రూ.6.5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన మహిళను హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వనస్థలిపురం సీఐ ఎస్.రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడకు చెందిన బడ్డం జ్యోతి (48) గత తొమ్మిదేళ్లుగా వనస్థలిపురం కమలానగర్‌లో నివాసం ఉంటోంది.

తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి, పెట్టుబడులపై 10శాతం వరకు వడ్డీ ఇస్తానని పలువురిని ఆకర్షించింది. అదే సమయంలో పరిచయస్తులతో చిట్టీలు కూడా నడిపించింది. మొదట్లో చెప్పినట్లుగానే లాభాలు, వడ్డీలు చెల్లించడంతో బాధితులు ఆమెను పూర్తిగా నమ్మారు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 2020 నుంచి వనస్థలిపురం పరిధిలో సుమారు 10మంది బాధితుల నుంచి రూ.6.5 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. విచారణలో మరికొందరి నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు వసూలు చేసినట్లు జ్యోతి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ డా.బి.అనురాధ, వనస్థలిపురం ఏసీపీ పి.కాశీరెడ్డి పర్యవేక్షణలో నిందితురాలిని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

click here to read more

click here to read హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం..ఆ తర్వాత అసలు కథ

Leave a Reply