బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యం

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యం
-ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-ముఖ్య అతిథిగా హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి కార్య కర్త కలిసికట్టుగా పని చేయాలని భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్య క్రమాన్ని మున్సిపాలిటీ కన్వీనర్ కనకం గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు ఇను గాల నరసింహారెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాచర్ల గణేష్ మాట్లాడుతూ…తెలంగాణ ఆవిర్భావంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ పార్టీ కేవలం రాజకీయ సంస్థ మాత్రమే కాకుండా ప్రజల ఆశయాల ప్రతిబింబమని పేర్కొన్నారు. అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని తెలిపారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, మండల కన్వీనర్ తోట సురేందర్, కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగని అనిల్ గౌడ్, తాటికొండ మధు, బూర్ల రాజేశ్వర్, నాయకులు బూర్ల రమేష్, గుండె మల్లేష్, గుండె రంజిత్, గుర్రం శంకర్, జబ్బార్, సుజాత, రమాదేవి, జ్యోతి రెడ్డి, నాగపురి పావని, చిట్టిబాబు, అన్నెపు అనిల్, ఆకుల నర్సింగం, మాచర్ల అశోక్, ఎండి రాజమహద్, బాస్కుల సుధాకర్, హీరాసింగ్ తదితరులు హాజరయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యం
