40k cr | తెగ..తాగేశారు ! ఆదాయంలో ఎక్సైజ్ శాఖ నయా రికార్డ్
40k cr | తెగ..తాగేశారు ! ఆదాయంలో ఎక్సైజ్ శాఖ నయా రికార్డ్
40k cr | గత ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల రాబడి
పుష్కర కాలంలో ఇదే మొదటి సారి
ఏడేళ్లలోనే రెట్టింపు ఆదాయం సాధించిన అబ్కారీ శాఖ
40k cr | హైదరాబాద్, ఆంధ్ర్రప్రభ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,209 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పుష్కర కాలంలో మద్యం ఆదాయం ఇంత భారీ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
ఏడేళ్లలో రెట్టింపు ఆదాయం
2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,859 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం, సరిగ్గా ఏడేళ్లలో అంటే 2025-26 నాటికి రెట్టింపు అవ్వడం గమనార్హం. 2024-25లో వచ్చిన రూ.37,487 కోట్లతో పోలిస్తే, ఈసారి అదనంగా రూ.2,722 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. మద్యం అమ్మకాలు 7 శాతం పెరగడంతో పాటు, ధరల పెంపు కూడా ఈ రికార్డు ఆదాయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
లిక్కర్ సేల్స్ ఇలా..

లిక్కర్: 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడైంది. గతేడాదితో పోలిస్తే ఇది 2 శాతం పెరుగుదల.
బీర్: గతేడాది 536.13 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి 387.34 లక్షల కేసులకు పడిపోయింది. అంటే బీర్ అమ్మకాలు 9 శాతం తగ్గాయి.
డిసెంబర్ రికార్డు: ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలోనే అత్యధికంగా రూ.5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
అదనపు ఆదాయ వనరులు
మద్యం విక్రయాలతో పాటు లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల ద్వారా కూడా భారీ ఆదాయం సమకూరింది.
మద్యం దుకాణాలు: 2,620 షాపుల రెంటల్ ఫీజు ద్వారా రూ.1,771 కోట్లు.
బార్లు: 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్లు.
దరఖాస్తులు: 95,628 అప్లికేషన్ల ద్వారా అదనంగా రూ.2,869 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెరుగుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా ఎక్సైజ్‌శాఖకు అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2015-16లో రూ. 12,706 కోట్లు, 2016-17లో రూ. 14.184 కోట్లు, 2017-18లో రూ.17,597 కోట్లు, 2018-19లో రూ.20,859 కోట్లు, 2019-20లో రూ.22,605 కోట్లు, 2020-21లో రూ.27,286 కోట్లు 2021-22లో రూ.30,783 కోట్లు , 2022-23లో రూ. 35,145 కోట్లు , 2023-24లో రూ.37,675 కోట్లు , 2024‘25లో రూ.37,488 కోట్లు 2025‘26లో రూ. 40,209 కోట్ల ఆదాయం వచ్చింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు ఇలా…
- 2025 ఏప్రిల్… రూ. 3,272 కోట్లు
- 2025 మే… రూ. 3,561 కోట్లు
- 2025 జూన్… రూ. 3,273 కోట్లు
- 2025 జూలై… రూ. 3,320 కోట్లు
- 2025 ఆగస్టు… రూ. 3,082 కోట్లు
- 2025 సెప్టెంబర్… రూ. 3,048 కోట్లు
- 2025 అక్టోబర్… రూ. 2,709 కోట్లు
- 2025 నవంబర్… రూ. 2,868 కోట్లు
- 2025 డిసెంబర్… రూ. 5,051 కోట్లు
- 2026 జనవరి… రూ. 3,325 కోట్లు
- 2026 ఫిబ్రవరి… రూ. 3,208 కోట్లు
- 2026 మార్చి… రూ. 3,486 కోట్లు
